ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సీఎస్‌కే ఆటగాడు శివమ్ దూబే అదరగొట్టాడు.
ఆఖరి వరకు క్రీజులో ఉండి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. రహానే ఔటయ్యక క్రీజులోకి వచ్చిన దూబే.. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. డారిల్ మిచెల్ ఔటయ్యాక తన ఆటలో దూకుడు పెంచిన దూబే.. మ్యాచ్‌ను త్వరగా ముగించాడు. 28 బంతులు ఎదుర్కొన్న దూబే.. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అతడితో పాటు రచిన్ రవీంద్ర(37) పరుగులతో అదరగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో అనుజ్ రావత్(48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దినేష్ కార్తీక్(38 నాటౌట్), డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్‌కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Shivam Dube - the backbone of CSK middle order. 🫡pic.twitter.com/fWAXiy4Kzm
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024
Comments
Please login to add a commentAdd a comment