చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, సూచనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 16వ సీజన్ ఐపీఎల్‌లో చెన్నై విజేతగా నిలువడంలో దూబే కీలకంగా వ్యవహరించాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన శివమ్ దూబే ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లాడి 158.33 స్ట్రైక్‌రేట్‌తో 416 పరుగులు సాధించాడు. కీలకమైన మిడిలార్డర్‌లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విజయాలందించాడు. 'పరిమ్యాచ్ స్పోర్ట్స్'(Parimatch Sports)కు బ్రాండ్‌అంబాసిడర్‌గా ఎంపికైన దూబే గురువారం హైదరాబాద్‌కు విచ్చేశాడు.
ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ ''గత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. చెన్నై జట్టుతో ఈ సీజన్ మరిచిపోని అనుభూతిని మిగిల్చింది. మేనేజ్‌మెంట్, సహాయక బృందం మద్దతుతో నేను ఈ స్థాయిలో రాణించగలిగాను. కెప్టెన్ ధోనీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒత్తిడికి లోనవ్వకుండా ఆటపైన ఎలా దృష్టి సారించాలనేది తెలుసుకున్నా. ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ధోనినే కారణం.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తన టీం సభ్యుల గురించి దూబే మాట్లాడుతూ.. అంబటి రాయుడు అపుడప్పుడు మస్తీ చేసినప్పటికి చూడటానికి సీరియస్‌గా కనిపంచేవాడు.. దీపక్ చాహర్ ప్రాంక్ స్టార్‌గా అభివర్ణించారు. వ్యక్తిగత ఆట కన్నా బృందంగా రాణించడమే ముఖ్యంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఇండియన్ టీంకు ఆడటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని..ఈ ఐపీఎల్ కూడా ఎన్నో మధురజ్ఞ్ఞాపకాలను అందించిందన్నాడు.
చదవండి: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Comments
Please login to add a commentAdd a comment