promotional event
-
మై ఛాయిస్!
భారతీయ మహిళలకు కుర్తాలు ఇష్టమైన దుస్తులు. వృత్తిరీత్యా టీషర్ట్లు ధరించడం అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే ‘విమెన్స్ డే’ సందర్భంగా జొమాటో తన మహిళా డెలివరీ పార్టనర్లకు ఎర్ర కుర్తాలను బహూకరించింది. ఇకపై వారు డ్యూటీలో నచ్చిన టీ షర్ట్గాని, కుర్తా గాని ధరించవచ్చు. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ యాడ్ ఇంటర్నెట్లో కుతూహలం రేపుతోంది. జొమాటోలో దేశమంతా మూడున్నర లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నారు. అంటే ఫుడ్ డెలివరీ చేసే బోయ్‌లు. వీరిలో స్త్రీలు కేవలం 1500 నుంచి 2000 మంది మాత్రమే ఉన్నారు. టూ వీలర్ మీద వేళకాని వేళలో తిరగాల్సి రావడం వల్ల ఇదొక ఛాలెంజింగ్ జాబ్ అయ్యింది మహిళలకు. అయినప్పటికీ సవాలుగా తీసుకుని వందల ఆర్డర్లు డెలివరీ చేస్తున్న జొమాటో మహిళలు ఉన్నారు. వృత్తిరీత్యా వారు టీషర్ట్ ధరించాల్సి ఉంటుంది. అది అందరికీ సౌకర్యం కాకపోవచ్చు. అందుకే జొమాటో మొన్నటి విమెన్స్ డే రోజు కుర్తాలు బహూకరించింది. ‘మీ చాయిస్. మీరు టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే కుర్తాలు వేసుకోవచ్చు’ అని చెప్పింది. ఇందుకోసం ప్రమోషన్ యాడ్ చేస్తే మహిళా డెలివరీ పార్టనర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘జేబులున్న కుర్తా నాకు నచ్చింది’ అని ఒక మహిళ చెప్పింది. ‘ఫోటోలు బాగా తీయండి’ అని మరో మహిళ ఉత్సాహపడింది. ‘పదండి అందరం మనాలి వెళ్దాం’ అని మరో మహిళ ఉత్సాహ పరిచింది. కొత్త ఉపాధి మార్గంలో వెరవక నడిచే వీరందరినీ చూసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. దేశీయ దుస్తుల్లో బాగున్నారంటూ కితాబిచ్చారు. -
ధోనిపై 'సిక్సర్ల' దూబే ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సలహాలు, సూచనల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన 16వ సీజన్ ఐపీఎల్లో చెన్నై విజేతగా నిలువడంలో దూబే కీలకంగా వ్యవహరించాడు. భారీ సిక్సర్లకు పెట్టింది పేరైన శివమ్ దూబే ఈ సీజన్లో 16 మ్యాచ్‌లాడి 158.33 స్ట్రైక్‌రేట్‌తో 416 పరుగులు సాధించాడు. కీలకమైన మిడిలార్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విజయాలందించాడు. 'పరిమ్యాచ్ స్పోర్ట్స్'(Parimatch Sports)కు బ్రాండ్అంబాసిడర్గా ఎంపికైన దూబే గురువారం హైదరాబాద్‌కు విచ్చేశాడు. ఈ సందర్భంగా దూబే మాట్లాడుతూ ''గత ఐపీఎల్ సీజన్ అద్భుతంగా సాగింది. చెన్నై జట్టుతో ఈ సీజన్ మరిచిపోని అనుభూతిని మిగిల్చింది. మేనేజ్మెంట్, సహాయక బృందం మద్దతుతో నేను ఈ స్థాయిలో రాణించగలిగాను. కెప్టెన్ ధోనీ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఒత్తిడికి లోనవ్వకుండా ఆటపైన ఎలా దృష్టి సారించాలనేది తెలుసుకున్నా. ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ధోనినే కారణం.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన టీం సభ్యుల గురించి దూబే మాట్లాడుతూ.. అంబటి రాయుడు అపుడప్పుడు మస్తీ చేసినప్పటికి చూడటానికి సీరియస్‌గా కనిపంచేవాడు.. దీపక్ చాహర్ ప్రాంక్ స్టార్‌గా అభివర్ణించారు. వ్యక్తిగత ఆట కన్నా బృందంగా రాణించడమే ముఖ్యంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఇండియన్ టీంకు ఆడటం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని..ఈ ఐపీఎల్ కూడా ఎన్నో మధురజ్ఞ్ఞాపకాలను అందించిందన్నాడు. చదవండి: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్ 'మిస్టర్ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్!' -
ముబారకన్ ప్రమోషనల్ ఈవెంట్లో స్టార్స్
-
'తమాషా' టీం సందడి
-
ముంబైలో బ్లాక్ బ్యూటీ బిపాసా సందడి