సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో జట్టుతో పాటు ఉన్న శివమ్ దూబే, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.
మయాంక్ యాదవ్, శివమ్ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్ పరాగ్ భుజం సమస్య కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.
బౌలింగ్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్, పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా.. వికెట్‌కీపర్లుగా సంజూ శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, అవేశ్ ఖాన్, యశ్ దయాళ్
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్..
తొలి మ్యాచ్- నవంబర్ 8 (డర్బన్)
రెండో మ్యాచ్- నవంబర్10 (గ్వెకెర్బా)
మూడో మ్యాచ్- నవంబర్ 13 (సెంచూరియన్)
నాలుగో మ్యాచ్- నవంబర్ 15 (జోహనెస్‌బర్గ్)
Comments
Please login to add a commentAdd a comment