
అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు 16 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20ల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 14 నెలల తర్వాత వీరిద్దరూ టీ20ల్లో భారత జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. ఇక సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రుత్‌రాజ్ గాయం కారణంగా దూరం కాగా.. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
ఇక హార్దిక్ పాండ్యా స్ధానంలో పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. గతేడాది ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఆసియా క్రీడల్లో అద్భుతంగా రాణించిన దూబేకు ఎట్టకేలకు జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దూబేను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"శివమ్ దూబే తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చాడు. సెలక్టర్లు సరైన నిర్ణయం తీసుకున్నారు. సెలక్టర్ల నిర్ణయం నన్ను ఏమి ఆశ్చర్యపరచలేదు. జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా స్ధానాన్ని భర్తీ చేసే ఆటగాడి కావాలి. ఆ సత్తా దూబేకు ఉంది. అతడిని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారని భావించాను. అతడిని సౌతాఫ్రికాకు తీసుకువెళ్లి ఉంటే విదేశీ పిచ్‌లపై ఎలా ఆడేవాడన్నది మేనెజ్‌మెంట్‌కు ఒక అవగహన వచ్చి ఉండేది.
కానీ సెలక్షన్ కమిటీ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. స్వదేశంలో ఆసీస్ సిరీస్‌లో కూడా అదే పరిస్థితి. జట్టులో ఉన్నప్పటికి సిరీస్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. కచ్చితంగా జట్టుకు ఆరో బౌలర్ అవసరం. కాబట్టి దుబేకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కుతుందని ఆశిస్తున్నాను" అని చోప్రా తన యూట్యాబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా భారత తరపున ఇప్పటివరకు 18 టీ20లు ఆడిన దూబే.. 152 పరుగులతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment