రంజీ ట్రోఫీ 2024లో భాగంగా అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు శివమ్ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 87 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతక్కొట్టాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దూబే అసోం బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ముంబై ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ 31 పరుగులు (షమ్స్ ములానీ) కాగా.. దూబే ఒక్కడే వన్ మ్యాన్ షో నడిపించాడు. గత మ్యాచ్‌లో రెస్ట్ తీసుకున్న దూబే రీఎంట్రీలో అదగొట్టాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 95 బంతులు ఎదుర్కొన్న దూబే 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్ (2) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 30, భుపేన్ లాల్వాని 0, హార్దిక్ తామోర్ 22, కెప్టెన్ అజింక్య రహానే 22, సుయాంశ్ షేడ్గే 0, షమ్స ములానీ 31 పరుగులు చేసి ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై స్కోర్ తొలి ఇన్నింగ్స్‌లో 217/6గా ఉంది. అసోం బౌలర్లలో దిబాకర్ జోహ్రి, రాహుల్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సునీల్ లచిత్, కునాల్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
ఇవాళే మొదలైన ఈ మ్యాచ్‌లో అసోం టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అసోం బ్యాటర్లను శార్దూల్ ఠాకూర్ ఉతికి ఆరేశాడు (6/21). శార్దూల్‌తో పాటు షమ్స్ ములానీ (2/8), తుషార్ దేశ్‌పాండే (1/32), మోహిత్ అవస్థి (1/10) కూడా చెలరేగడంతో అసోం ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టు 84 పరుగులకే ఆలౌటైంది. అసోం ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఠాకూరీ (31), సాహిల్ జైన్ (12), అబ్దుల్ అజీజ్ ఖురేషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment