ఆర్సీబీతో మ్యాచ్ అంటే శివాలెత్తిపోతాడు(PC: IPL)
Shivam Dube vs RCB in the IPL: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే చాలు శివాలెత్తిపోతాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివం దూబే. తాజాగా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లోనూ మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
మరో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిసి స్కోరును బోర్డును పరుగులు పెట్టించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఐదో స్థానంలో వచ్చిన శివం 28 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 పరుగులు చేయగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసిన జడ్డూ 17 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఆఖరి వరకు ఇద్దరూ అజేయంగా నిలిచారు.
ఇక ఐపీఎల్-2023 ఫైనల్లోనూ దూబే- జడేజా ద్వయం ఇదే తరహాలో నాటౌట్‌గా నిలిచి గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. నాటి మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన దూబే 32, ఏడో స్థానంలో వచ్చిన జడేజా 15 పరుగులతో అజేయంగా నిలిచారు.
నేను, జడేజా నాటౌట్‌గానే ఉన్నాం
ఈ నేపథ్యంలో తాజా విజయం తర్వాత శివం దూబే మాట్లాడుతూ.. ‘‘2023 నుంచి ఇప్పటి దాకా నేను, జడేజా నాటౌట్‌గానే ఉన్నాం. చెన్నై తరఫున మ్యాచ్ ఫినిష్ చేయడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.
మహీ భాయ్ నుంచి నేను నేర్చుకున్నది అదే. ప్రతి మ్యాచ్‌లోనూ తనలాగే ఫినిషర్ పాత్ర పోషించాలని భావిస్తాను. ఐపీఎల్ తాజా ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే నాకు ఆ అవకాశం దక్కింది.
బాల్‌ను సరిగ్గా అంచనా వేసి బాదడంపైనే దృష్టి సారించాను. ఆఖరి వరకు క్రీజులో ఉంటే నేను ఏం చేయగలనో నాకు తెలుసు’’ అని పేర్కొన్నాడు. సహచర ప్లేయర్ రచిన్ రవీంద్రతో సంభాషిస్తూ శివం దూబే ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
ఆర్సీబీతో మ్యాచ్ అంటే పూనకాలే!
ఇప్పటి వరకు ఆర్సీబీతో మ్యాచ్‌లలో మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న శివం దూబే సగటు 113.50తో 227 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 16 సిక్సర్లు కూడా ఉన్నాయి. 2021లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 46(32), 2022లో 95*(46), 2023లో 52(27).. తాజాగా 34*(28) పరుగులు చేశాడు శివం దూబే!!
Talk about living upto the Impact Player tag! 👏 👏
— IndianPremierLeague (@IPL) March 22, 2024
That was one fine knock from Shivam Dube in the chase! 👌 👌
Scorecard ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL | #CSKvRCB | @IamShivamDube | @ChennaiIPL pic.twitter.com/207zz2Jz8l
Comments
Please login to add a commentAdd a comment