టీమిండియా వదల్లేదు.. న్యూజిలాండ్ కథ మారలేదు. భారత్ బౌలింగ్‌లో మెరుపులు ఆగలేదు.. కివీస్ బ్యాటింగ్‌లో వైఫల్యం గాడిన పడలేదు. టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడలేదు. న్యూజిలాండ్ ఒత్తిడిని అధిగమించలేదు. వెరసి చివరి టీ20లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఫలితంగా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌చేసింది. దాంతో కివీస్ గడ్డపై తొలిసారి ఒక టీ20 సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా నిలిచింది.