అతడిని చూస్తే యువీ గుర్తుకొస్తున్నాడు.. హార్దిక్‌ను వదిలేసి! | Some Have Said Leave Hardik And Pick Shivam Dube, Ex India Star On Selection Dilemma T20 World Cup 2024 - Sakshi
Sakshi News home page

Shivam Dube: యువీ గుర్తుకొస్తున్నాడు.. పవర్‌ హిట్టర్‌! హార్దిక్‌కు వదిలేయాలని..

Published Sat, Jan 20 2024 11:44 AM | Last Updated on Sat, Jan 20 2024 12:43 PM

Some Said Leave Hardik Pick Dube But Ex India Star On Selection Dilemma T20 WC - Sakshi

శివం దూబే- హార్దిక్‌ పాండ్యా

India Potential Selection Dilemma For T20 World Cup 2024: టీమిండియా ఆల్‌రౌండర్‌ శివం దూబేపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ప్రశంసలు కురిపించాడు. దూబే ఆట తీరు చూస్తుంటే తనకు యువరాజ్‌ సింగ్‌ గుర్తుకు వస్తున్నాడని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024 జట్టులో ఈ ముంబై బ్యాటర్‌కు కచ్చితంగా చోటివ్వాలని ఆకాశ్‌ చోప్రా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.

అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా చాలా ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున బరిలోకి దిగిన శివం దూబే.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 124 పరుగులు సాధించిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. రెండు వికెట్లు తీశాడు.

పాండ్యా గైర్హాజరీలో చోటు సంపాదించి.. సత్తా చాటి
తద్వారా టీమిండియా 3-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. గాయం కారణంగా దూరమైన హార్దిక్‌ పాండ్యా స్థానంలో వచ్చిన అవకాశాన్ని ఇలా పూర్తిగా సద్వినియోగం చేసుకున్న దూబే.. ప్రపంచకప్‌-2024 రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు గట్టి సందేశమే పంపాడు.

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘శివం అతి సుందరం.. పవర్‌ హిట్టర్‌.. మూడో టీ20లో అతడిని ఇంకాస్త లేట్‌గా బ్యాటింగ్‌కు పంపాల్సింది. శివం కంటే ముందుగా సంజూ శాంసన్‌ లేదంటే.. రింకూ సింగ్‌ను బరిలోకి దించితే బాగుండేది. ఎందుకంటే శివం.. ఆచితూచి ఆడే ప్లేయర్‌ కాదు.. అటాకర్‌.

అటాకర్‌.. అచ్చం యూవీ మాదిరే
బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడు. నాకు అతడిని చూస్తే యువీ గుర్తుకువస్తాడు. శివంను లోయర్‌ ఆర్డర్‌లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు.

ఇద్దరూ జట్టులో ఉండాలి
అదే విధంగా.. ‘‘తొలి రెండు మ్యాచ్‌లలో శివం దూబే ఎంత శక్తిమంతంగా సిక్సర్లు బాదాడో చూశాం. అతడి ఆట తీరుకు ముచ్చటపడి కొందరైతే హార్దిక్‌ను వదిలేసి.. దూబేను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. నా వరకైతే ఈ ఇద్దరూ జట్టులో ఉంటే బాగుంటుంది.

అఫ్గన్‌తో మూడు మ్యాచ్‌లలో అదరగొట్టి తాను ప్రపంచకప్‌ రేసులో ఎవరి కంటే తక్కువ కాదని దూబే నిరూపించాడు. అసలైన పోటీదారు అనిపించుకున్నాడు. ఐపీఎల్‌లోనూ దూబే ఇలాగే రాణిస్తే.. టీమిండియాలోకి రాకుండా అతడిని ఎవరూ ఆపలేరు’’ అని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్‌ సింగ్‌
Ranji Trophy 2024: బ్యాట్‌తో చెలరేగిన దూబే.. టెస్టుల్లోనూ ఎంట్రీకి సై!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement