IPL 2023, RCB Vs CSK: శివమ్‌ దుబే విధ్వంసం.. 111 మీటర్ల భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌ | Shivam Dube Smashes 111-Metre Six Against RCB - Sakshi
Sakshi News home page

IPL 2023: శివమ్‌ దుబే విధ్వంసం.. 111 మీటర్ల భారీ సిక్సర్‌! వీడియో వైరల్‌

Published Mon, Apr 17 2023 10:04 PM | Last Updated on Tue, Apr 18 2023 8:35 AM

Shivam Dube smashes massive 111m six for CSK against RCB - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దుబే శివాలెత్తాడు. రహానే ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన దుబే.. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. దుబే బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఈ క్రమంలో 25 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. మరోవైపు కాన్వేతో కలిసి మూడో వికెట్‌కు 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

దుబే భారీ సిక్సర్‌..
ఇక ఈ మ్యాచ్‌లో దుబే భారీ సిక్సర్‌ బాదాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌ వేసిన హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో 111 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. అతడి పవర్‌కు బంతి స్టేడియం రూఫ్‌ మీద పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. కాన్వే(83), దుబే(52) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.
చదవండిIPL 2023 GT Vs RR: షమీపై సీరియస్‌ అయిన హార్దిక్‌.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియో​వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement