
PC: Hindi Now
అండర్-19 ఆసియాకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత యువ జట్టు ఘన విజయం సాధించింది. భారత విజయంలో కెప్టెన్ కులకర్ణి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 173 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో రాజ్ లింబానీ, కులకర్ణి తలా మూడు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. నమాన్ తివారీ రెండు వికెట్లు సాధించాడు. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ జమ్షీడ్ జద్రాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 174 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కులకర్ణి(70) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ముషీర్ ఖాన్ 48 పరుగులతో రాణించాడు. ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో డిసెంబర్ 10న దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.