బిగ్ బాష్ లీగ్-2023 నుంచి అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తప్పుకున్నాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న రషీద్.. త్వరలో శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాష్ లీగ్ నుంచి రషీద్ వైదొలిగినట్లు సమాచారం. ఈ విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ దృవీకరించింది. గత కొన్ని సీజన్ల నుంచి అడిలైడ్ స్ట్రైకర్స్‌కు రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా రషీద్ ఒక వేళ తన వెన్నెముకకు సర్జరీ చేసుకుంటే కచ్చితంగా క్రికెట్‌కు దాదాపు ఐదు నంచి ఆరు నెలల పాటు దూరం కానున్నాడు. ఈ క్రమంలో భారత్-అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు, ఐపీఎల్-2024 సీజన్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఆడుతున్నాడు. వచ్చే ఏడాది వెస్టిండీస్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని రషీద్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే సర్జరీ చేసుకోవాలని రషీద్ నిర్ణయించకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీ20ల్లో అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్-2023లోనూ రషీద్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి వరల్డ్‌క్లాస్ జట్లను ఓడించడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు.
చదవండి: విండీస్ టీ20 ప్రపంచకప్ వీరుడికి బిగ్ షాకిచ్చిన ఐసీసీ..
Comments
Please login to add a commentAdd a comment