Dhoni And Ravi Shastri Intense Discussion With Kohli During Practice.. టి20 ప్రపంచకప్‌లో టీమిండియా.. అఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఆడనుంది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న టీమిండియా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే అవకాశాలు ఉంటాయి. ఇక మంగళవారం ప్రాక్టీస్ సమయంలో కోహ్లితో రవిశాస్త్రి, ధోనిలు సుధీర్ఘ చర్చ జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు 20 నుంచి 30 నిమిషాలు పాటు ఈ ముగ్గురి మధ్య మ్యాచ్‌కు సంబంధించి సీరియస్ చర్చ నడిచినట్లు తెలుస్తోంది. అయితే కొద్దిసేపటి తర్వాత రవిశాస్త్రి అక్కడి నుంచి వెళ్లిపోయినప్పటికీ.. కోహ్లి, ధోనిలు చాలాసేపు మాట్లాడుకున్నారు. వరుస రెండు పరాజయాలతో డీలా పడిన టీమిండియా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఏం చేస్తుందనేది కీలకంగా మారింది.
చదవండి: IND Vs AFG: ప్రాక్టీస్ బాగానే ఉంది.. అసలు మ్యాచ్‌లో మాత్రం
ఇక అంతకముందు ప్రాక్టీస్ సమయంలో కోహ్లి.. సూర్యకుమార్‌తో చాలాసేపు మాట్లాడాడు. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో వెన్నునొప్పితో సూర్యకుమార్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. ఇక కోహ్లితో భేటీకి ముందు ధోని, రవిశాస్త్రి మధ్య జరిగిన సంభాషణలో సూర్యకుమార్ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే సూర్యకుమార్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సూర్యతో పాటు ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉంటాడని సంకేతాలు రావడంతో.. మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జట్టులోకి అశ్విన్ రాక కూడా దాదాపు ఖరారైనట్లే. వరుణ్ చక్రవర్తి స్థానంలో అశ్విన్ తుదిజట్టులోకి వస్తాడా లేక అదనపు స్పిన్నర్‌గా ఉంటాడా అనేది తుది జట్టు ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.
చదవండి: IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?!
ఇక అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. అఫ్గాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్‌లో ఓడి మంచి ఆత్మవిశ్వాసంతో కనబడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
That's some hitting, @imjadeja ! 👌 👌#TeamIndia #T20WorldCup #INDvAFG pic.twitter.com/Yf89bCRlB1
— BCCI (@BCCI) November 3, 2021
Comments
Please login to add a commentAdd a comment