T20 World Cup Ind Vs Nz: Reason Revealed Rohit Batting Demotion - Sakshi
Sakshi News home page

IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?!

Published Wed, Nov 3 2021 9:14 AM | Last Updated on Wed, Nov 3 2021 11:24 AM

T20 World Cup 2021: Reports Reason Revealed Rohit Batting Demotion Vs NZ - Sakshi

Reasons Behind Rohit Sharma Batting Demotion

Who Took Decision Revealed To Demote Rohit Sharma As Opener Vs NZ.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో​ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ కాకుండా వన్‌డౌన్‌లో రావడం అందర్ని ఆశ్చర్యపరించింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌ ఆ మ్యాచ్‌లో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ డిమోషన్‌ వెనుక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. రెండురోజులుగా రోహిత్‌ బ్యాటింగ్‌ డిమోషన్‌కు కారణం కోహ్లి, రవిశాస్త్రి, రోహిత్‌ శర్మ అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే.. టీమిండియా మెంటార్‌ ఎంఎస్‌ ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .

చదవండి: ధోని, రవిశాస్త్రి మధ్య ఏం జరిగింది.. కోహ్లినే కారణమా!

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సూర్యకుమార్‌ యాదవ్ ఫిట్‌నెస్‌ కారణాలతో ఆడడం లేదని తేలింది. దీంతో రంగంలోకి దిగిన ధోని ఇషాన్‌ కిషన్‌ను తుదిజట్టులో చోటు కల్పిస్తే.. ఓపెనర్‌గా పంపిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్‌గా ఇషాన్‌ న్యాయం చేయగలడని.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇదే రుజువయిందని ధోని పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ఓపెనర్‌గా ఉన్న రోహిత్‌ శర్మను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో డిమోట్‌ చేయాలనే నిర్ణయం ధోనిదే. ఈ నిర్ణయంతో కోహ్లి, రవిశాస్త్రి ముందు ఆలోచించినా.. ధోనిపై నమ్మకంతో ఏకీభవించారు. కానీ కివీస్‌తో మ్యాచ్‌లో ప్లాన్‌ బెడిసికొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ 4 పరుగులకే ఔటయ్యాడు. 

ఇక రవిశాస్త్రి, ధోని మధ్య సీరియస్‌ సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే ధోని, రవిశాస్త్రి మధ్య రోహిత్‌ బ్యాటింగ్‌ డిమోషన్‌పైనే సీరియస్‌ చర్చ నడిచినట్లు అభిమానులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. రోహిత్‌ బ్యాటింగ్‌ డిమోషన్‌ వెనుక కారణం ధోనినా.. వార్నీ.. ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి అతనితో సీరియస్‌ చర్చ చేశాడా అంటూ కామెంట్స్‌ చేశారు.

చదవండి: రోహిత్‌కు కూడా తెలుసు... అందుకే ఇషాన్‌ను పంపాం

ఇక సూపర్‌ 12 దశలో వరుసగా రెండు పరాజయాలు చవిచూసిన టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే సెమీస్‌ అవకాశాలు క్లిష్టం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే సెమీస్‌పై ఆశలు ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement