
టీమిండియా కోచ్ రవిశాస్త్రితో మెంటార్ ధోని సంభాషణ(PC: Social Media)
Gautam Gambhir Criticised Virat Kohli Captaincy Against New Zealand: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో సెమీస్ చేరేందుకు న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తుది జట్టు కూర్పు సరిగ్గా లేనందువల్లే కోహ్లి సేన భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మను డీమోట్ చేయడం వెనుక మెంటార్ ధోని హస్తం ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో.. కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పుడు నిర్ణయాల ఫలితంగానే అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాత్రం.. రోహిత్ విషయంలో ధోని ఇలాంటి సలహాలు ఇచ్చాడంటే తాను మాత్రం నమ్మడం లేదన్నాడు. కోహ్లి వ్యూహాత్మక తప్పిదాల వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించాడు.
ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్‌లో కివీస్‌తో మ్యాచ్‌లో జరిగిన మార్పుల గురించి గంభీర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘వ్యూహకర్తగా కోహ్లి నన్ను ఎప్పుడూ మెప్పించలేదు. ఆదివారం మరోసారి నిరాశపరిచాడు. అసలు పాకిస్తాన్‌తో ఆడిన జట్టులో ఎందుకు మార్పులు చేశాడు? అది చాలదన్నట్లు రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించాడు.
ఈ మార్పుల వెనుక ధోని హస్తం ఉందంటే నేను నమ్మను. తనతో కలిసి చాలా కాలం క్రికెట్ ఆడాను. తన ఆలోచనా విధానం ఇలా ఉండదు. ఒక్క గేమ్‌కే జట్టులో మార్పులు సూచించడు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్లు, న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో వరుస పరాజయాలు చవిచూసిన టీమిండియా అఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలతో తదుపరి మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: Babar Azam: దుమ్ములేపిన బాబర్ ఆజం.. వనిందు హసరంగా తొలిసారిగా
Comments
Please login to add a commentAdd a comment