
ICC Cricket World Cup 2023- India vs Afghanistan Updates:
14 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ స్కోరు: 66/3
ఒమర్జాయ్ 1, హష్మతుల్లా షాహిది 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.
13.1: రహ్మత్ షాను ఎల్బీడబ్ల్యూ చేసిన శార్దూల్ ఠాకూర్
12.4: పాండ్యా బౌలింగ్‌లో గుర్బాజ్(21) అవుట్.
9 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ స్కోరు: 42/1
6.4: తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్గనిస్తాన్
బుమ్రా బౌలింగ్‌లో జద్రాన్ అవుట్
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఓ మార్పు చేయగా.. ఆఫ్ఘనిస్తాన్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నాడు.
కాగా, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చెరో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. భారత్.. తమ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించగా.. ఆఫ్ఘన్లు తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆఫ్ఘనిస్తాన్: రెహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌కీపర్), హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్ హక్ ఫారూకీ
Comments
Please login to add a commentAdd a comment