ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన టీమిండియా.. ఈనెల 11న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్దంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇదివరకే న్యూఢిల్లీకి చేరుకున్న భారత్ ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉంది. డెంగ్యూ ఫీవర్ కారణంగా ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు కూడా అనుమానమేనని తెలుస్తుంది. ఇదే జరిగితే టీమిండియా ఇషాన్ కిషన్‌తో కంటిన్యూ అవుతుంది. ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో సైతం ఇషాన్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.
టీమిండియాలో మార్పులు ఉంటాయా..?
ఆసీస్‌పై అద్భుత విజయం సాధించి, మరో విజయం కోసం ఉరకలేస్తున్న టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ఏమైనా మార్పులు చేస్తుందా లేక అదే జట్టును కొనసాగిస్తుందా అనే అంశంపై ప్రస్తుతం నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చకు సంబంధించి మెజార్టీ శాతం టీమిండియాలో ఎలాంటి మార్పులుండవనే అభిప్రాయపడుతున్నారు.
గిల్‌కు ఎలాగూ పూర్తిగా నయం కాలేదు కాబట్టి ఇషాన్ యధాతథంగా కొనసాగుతాడని, జట్టులో మార్పుకు మరో ఆస్కారం లేదని అంటున్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌లో విఫలమైనా ఇషాన్, శ్రేయస్‌లను టీమిండియా కొనసాగిస్తుందని, బౌలర్లను కదిపే సాహసం మేనేజ్‌మెంట్ చేయదని అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
టీమిండియాదే పైచేయి..
క్రికెట్ పసికూన అనే ముద్రను ఇప్పుడిప్పుడే చెరిపేసుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రపంచకప్‌తో పాటు వన్డే క్రికెట్ మొత్తంలో టీమిండియాపై పెద్దగా రికార్డు లేదు. ఈ ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో ఓసారి, ఓవరాల్‌గా వన్డేల్లో 3 సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.
ఇరు జట్లు 2019 వరల్డ్‌కప్‌లో తొలిసారి ఎదురెదురుపడగా, ఆ మ్యాచ్‌లో టీమిండియానే విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీమిండియాకు కాస్త పోటీ ఇచ్చినప్పటికీ ఆఖర్లో షమీ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో ఆ జట్టు చేతులెత్తేసింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను ఆఫ్ఘన్ బౌలర్లు 224 పరుగులకే కట్టడి చేశారు.
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (67), కేదార్ జాదవ్ (52) మాత్రమే రాణించారు. అనంతరం ఛేదనకు దిగిన ఆఫ్ఘన్లు ఓ దశలో విజయం సాధించేట్లు కనిపించినప్పటికీ, భారత బౌలర్లు వారి ఆశలను వమ్ము చేశారు. షమీ (4/40), బుమ్రా (2/39), చహల్ (2/36), హార్దిక్ (2/51) చెలరేగడంతో ఆఫ్ఘన్లు 213 పరుగులకు ఆలౌటై 11 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment