
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న హార్దిక్ వేగంగా కోలుకుంటున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా అఫ్గానిస్తాన్ సిరీస్‌కు, ఐపీఎల్ సీజన్‌కు దూరమవుతాడని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
వచ్చే ఏడాది జనవరిలో అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ సమయానికి పాండ్యా పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం. ఈ క్రమంలో అఫ్గానిస్తాన్ సిరీస్‌లో భారత జట్టును హార్దికే సారధిగా నడిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. స్వదేశంలో జనవరి 11 నుంచి అఫ్గాన్‌తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు.
దీంతో అతడి చీలమండకు గాయమైంది. అప్పటి నుంచి ఆటకు హార్దిక్ దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు హార్దిక్ దూరమయ్యాడు. ఇక ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకుంది. అంతేకాకుండా రోహిత్ శర్మను తప్పించి తమ జట్టు పగ్గాలను కూడా అప్పగించింది.
చదవండి: IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..!? సురేష్ రైనాకు..
Comments
Please login to add a commentAdd a comment