T20 World Cup 2021 Ind Vs Afg: Pakistani Actress Allegation On BCCI, See Aakash Chopra Reaction - Sakshi
Sakshi News home page

T20 World Cup 2021: అఫ్గాన్‌పై టీమిండియా గెలుపు.. బీసీసీఐపై పాక్‌ నటి వివాదాస్పద వ్యాఖ్యలు

Published Thu, Nov 4 2021 8:16 PM | Last Updated on Fri, Nov 5 2021 12:35 PM

T20 World Cup 2021: Pakistani Actress Makes Allegation On BCCI After India Beat Afghanistan, Aakash Chopra Gives Fitting Reply - Sakshi

Pakistani Actress Makes Allegation On BCCI After India Beat Afghanistan In T20 WC 2021: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా అఫ్గానిస్థాన్‌పై టీమిండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ పాకిస్థాన్‌ టీవీ నటి సెహర్‌ షిన్వారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మ్యాచ్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొనుగోలు చేసిందని అర్ధం వచ్చేలా సంచలన ఆరోపణలు చేసింది. భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా మ్యాచ్‌ అనంతరం చేసిన ట్వీట్‌కు బదులుగా ఆమె రీ ట్వీట్‌ చేసింది. 

వివరాల్లోకి వెళితే.. అఫ్గాన్‌పై విజయానంతరం టీమిండియాకు విషెష్‌ తెలుపుతూ "భారత్‌.. భారత్‌లా ఆడిందంటూ" ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు. అయితే, ఆకాశ్‌ చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ రిప్లై ఇచ్చిన పాక్‌ నటి.. "BCCI Bought A Good Match" అంటూ రీ ట్వీట్‌ చేసింది. సెహర్ షిన్వారి చేసిన వ్యాఖ్యలకు ఆకాష్ చోప్రా తనదైన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. “వక్రబుద్ది గల మనుషుల నుంచి ఇలాంటి నెగిటివ్ మాటలే వస్తాయి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ట్వీటర్‌ వార్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాక్‌ నటిపై టీమిండియా అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు. 


చదవండి: మ్యాచ్‌ మధ్యలో అనిల్‌ కపూర్‌ పాటకు చిందేసిన విరాట్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement