న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తిర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోని స్టాండ్స్‌లో అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. గొడవకు గల కారణాలు తెలియరాలేదు కాని గొడవకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరలవుతుంది.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం ఓ వ్యక్తిపై సామూహిక దాడి జరిగినట్లు తెలుస్తుంది. దెబ్బలు తిన్న వ్యక్తి, దాడి చేసిన వ్యక్తులు అంతా టీమిండియా అభిమానులే ఉన్నట్లున్నారు. దాడి జరిగిన సన్నివేశాలను ఓ అభిమాని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ "నిజమైన ఢిల్లీ అనుభవం" అని కామెంట్ చేశాడు. మ్యాచ్ గురించి ఏమో కాని ప్రస్తుతం సోషల్‌మీడియాలో దీనిపైనే జర్చ జరుగుతుంది.
Lafda bhi ho gya pic.twitter.com/qFSm6dufCr
— KUNAL DABAS (@kunaldabas_) October 11, 2023
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌పై సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో (84 బంతుల్లో 131; 16 ఫోర్ల, 5 సిక్సర్లు) టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. కోహ్లి (55 నాటౌట్), ఇషాన్ కిషన్ (47), శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్) రోహిత్‌కు సహకరించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్‌జాయ్(62) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. బుమ్రా (4/39), హార్దిక్ (2/43), శార్దూల్ (1/31), కుల్దీప్ (1/40) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌ను కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో రోహిత్ చెలరేగడంతో టీమిండియా సునాయాస విజయం సాధించింది. కాగా, భారత్ అక్టోబర్ 14న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment