సూర్యకుమార్‌ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని | CWC 2023: Fan Was Saying Suryakumar Yadav Should Improve His Game When He Was Shooting On Camera | Sakshi
Sakshi News home page

CWC 2023: సూర్యకుమార్‌ యాదవ్‌కు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన అభిమాని

Published Wed, Nov 1 2023 1:24 PM | Last Updated on Wed, Nov 1 2023 1:33 PM

CWC 2023: Fan Was Saying Suryakumar Yadav Should Improve His Game When Surya Was Shooting On Camera - Sakshi

నంబర్‌ వన్‌ టీ20 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఓ అభిమాని దిమ్మతిరిపోయే షాకిచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఖాళీ సమయం దొరకడంతో సరదాగా కెమరా పట్టిన స్కై.. టీమిండియా వరల్డ్‌కప్‌ పెర్ఫార్మెన్స్‌పై ముంబై బీచ్‌ పరిసర ప్రాంతాల్లో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాడు. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి శాంపిల్‌ సేకరిస్తుండగా స్కైకు చుక్కెదురైంది.

ఓ అభిమానిని స్కై తన గురించే అడిగి విస్తుపోయే సమాధానం వినాల్సి వచ్చింది. సూర్యకుమార్‌ సదరు వ్యక్తిని ఇలా ప్రశ్నించాడు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రదర్శన ఎలా ఉందని అడగగా.. అతను ఇంకా మెరుగుపడాల్సి ఉందని ఆ అభిమాని సమాధానం చెప్పాడు. తాను మాట్లాడుతన్నది సూర్యకుమార్‌తోనేనని తెలియక ఆ అభిమాని తన మనసులోని మాటను వెల్లగక్కాడు. ఈ విషయాన్ని సూర్యకుమారే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. ఆ వ్యక్తి తన గురించి మాట్లాడుతున్నప్పుడు గట్టిగా నవ్వాలని అనిపించిందని స్కై చెప్పాడు. 

ఎవ్వరూ గుర్తు పట్టిన విధంగా చేతిపై ఉన్న టాటూలను కవర్‌ చేసుకుంటూ ఫుట్‌ షర్ట్‌ ధరించి, తలపై టోపీ, కళ్లద్దాలతో కెమరా పట్టుకుని టీమిండియా వరల్డ్‌కప్‌ ప్రదర్శనపై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సూర్యకుమార్‌కు మిశ్రమ సమాధానాలు వచ్చాయి. స్కై.. తనతో పాటు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రాల వరల్డ్‌కప్‌ ప్రదర్శనపై అభిమానుల అభిప్రాయాలను సేకరించాడు.

మెజారిటీ శాతం ఈసారి వారి ప్రదర్శన ఓకే అంటే, కొందరు ఇంకా మెరుగుపడాల్సి ఉందని అన్నారు. ఎవరు ఎలా ఆడిన ఈసారి మాత్రం టీమిండియా తప్పక వరల్డ్‌కప్‌ గెలుస్తుందని మెజార్టీ శాతం అభిప్రాయపడ్డారు. స్కై ‍చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో టీమిండియా.. శ్రీలంకతో జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌ను ముంబైలోనే ఆడనున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 2న ఈ మ్యాచ్‌ జరుగనుంది. టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. శ్రీలంకపై గెలిచి అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement