శ్రీలంక సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ | Indian Squad Announced For Sri Lanka White Ball Series 2024 | Sakshi
Sakshi News home page

శ్రీలంక సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన.. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్

Published Thu, Jul 18 2024 8:00 PM | Last Updated on Thu, Jul 18 2024 8:20 PM

Indian Squad Announced For Sri Lanka White Ball Series 2024

త్వరలో శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించారు. అందరూ ఊహించిన విధంగానే సూర్యకుమార్‌ యాదవ్‌ భారత నూతన టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వన్డే జట్టుకు రోహిత్‌ సారథ్యం వహించనుండగా.. రెండు జట్లకు (టీ20, వన్డే) శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 జట్టు కెప్టెన్సీ ఆశించిన హార్దిక్‌కు మొండిచెయ్యి ఎదురైంది. వన్డే జట్టుకు హర్షిత్‌ రాణా కొత్తగా ఎంపికయ్యాడు. 

కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. కోహ్లి కూడా వన్డే జట్టులో ఉన్నాడు. రిషబ్‌ పంత్‌, రియాన్‌ పరాగ్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబే, అర్షదీప్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్‌ అహ్మద్‌ రెండు జట్లకు ఎంపికయ్యారు. హార్దిక్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉండిన రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మలకు రెండు జట్లలో చోటు దక్కలేదు.

కాగా, టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరుగనుంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement