CWC 2023: లంకతో మ్యాచ్‌.. బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ విన్నర్‌ ఎవరంటే..? | IND VS SL: Sachin Makes Special Appearance As Shreyas Iyer Wins His 2nd Best Fielder Medal In WC, Video Viral - Sakshi
Sakshi News home page

CWC 2023 IND Vs SL: లంకతో మ్యాచ్‌.. బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ విన్నర్‌ ఎవరంటే..?

Published Fri, Nov 3 2023 11:46 AM | Last Updated on Fri, Nov 3 2023 12:49 PM

IND VS SL: Sachin Tendulkar Makes Special Appearance As Shreyas Iyer Wins His 2nd Best Fielder Medal In World Cup - Sakshi

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ టి దిలీప్‌ బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌ను బహుకరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌కు గాను ఈ మెడల్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ గెలుచుకున్నాడు. శ్రేయస్‌ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు గాను శ్రేయస్‌ తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫీల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రెండు క్యాచ్‌లు అందుకున్నందుకుగాను శ్రేయస్‌ను ఈ అవార్డు వరించింది.

విజేతను అనౌన్స్‌ క్రికెట్‌  గాడ్‌..
ప్రతి మ్యాచ్‌ అనంతరం వినూత్న రీతిలో మెడల్‌ విన్నర్‌ను అనౌన్స్‌ చేయించే దిలీప్‌.. ఈసారి ఎవరూ ఊహించని విధం​గా ఓ స్పెషల్‌ పర్సన్‌తో అవార్డును అనౌన్స్‌ చేయించాడు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ వర్చువల్‌గా శ్రేయస్‌ను విజేతగా ప్రకటించాడు. విజేతను ప్రకటించడంతో పాటు టీమిండియాను అభినందించి, బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఈ సందర్భంగా సచిన్‌ టీమిండియాకు తన అమూల్యమైన సందేశాన్ని కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. గిల్‌ (92), కోహ్లి (88), శ్రేయస్‌ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్‌ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్‌ షమీ (5-1-18-5), మొహమ్మద్‌ సిరాజ్‌ (7-2-16-3), జస్ప్రీత్‌ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్‌ రజిత టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement