అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కొత్త కెప్టెన్‌ అతడే!? రోహిత్‌ డౌటే? | India Squad For Afghanistan Series Is Likely To Be Announced Next Week, Rohit Sharma Likely To Return - Sakshi
Sakshi News home page

IND Vs AFG T20I Series: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియా కొత్త కెప్టెన్‌ అతడే!? రోహిత్‌ డౌటే?

Published Thu, Dec 28 2023 7:44 AM | Last Updated on Thu, Dec 28 2023 9:56 AM

India squad for Afghanistan series next week - Sakshi

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ అనంతరం టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. వచ్చే ఏడాది జనవరి 11న జరగనున్న తొలి టీ20తో ఈ వైట్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్‌కప్‌-2024కు ముందు భారత జట్టు ఆడనున్న ఆఖరి సిరీస్‌ ఇదే. ఈ సిరీస్‌కు భారత జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.

భారత కెప్టెన్‌ ఎవరు?
అయితే అఫ్గాన్‌ సిరీస్‌లో భారత జట్టు సారథిగా ఎవరు పగ్గాలు చేపడతారన్నది సందిగ్ధం నెలకొంది. ఇప్పటివరకు టీ20ల్లో భారత జట్టును సారథిలుగా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లు గాయాల బారిన పడ్డాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో గాయపడిన హార్దిక్‌.. కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా సౌతాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య, రుత్‌రాజ్‌ సైతం పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జట్టు పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తలలు పట్టుకుంటుంది. అయితే గత కొంత కాలంగా టీ20లకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో బీసీసీఐ ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ చర్చలు జరిపినట్లు సమాచారం.

అఫ్గాన్‌ సిరీస్‌లో జట్టును నడిపించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హిట్‌మ్యాన్‌ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు కొద్ది రోజుల సమయం అడిగినట్లు వినికిడి. ఒక వేళ రోహిత్‌ అందుకు అంగీకరించకపోతే.. అఫ్గాన్‌ సిరీస్‌లో జట్టు పగ్గాలను మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

అయ్యర్‌కు సారథిగా అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లలో అదరగొట్టిన అయ్యర్‌.. ఇప్పుడు టెస్టుల్లో తన మార్క్‌ను చూపిస్తున్నాడు.
చదవండి: AUS vs PAK: 5 వికెట్లతో చెలరేగిన కమ్మిన్స్‌.. 264 పరుగులకు పాక్‌ ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement