టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్ భారత్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సిరీస్ కోసం రషీద్ జట్టుతో పాటు భారత్‌కు విచ్చేసినప్పటికీ.. గాయం పూర్తిగా తగ్గకపోవడంతో సెలెక్టర్లు అతన్ని తిరిగి ఇంటికి పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.
ఇదే గాయం కారణంగా రషీద్ బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. రషీద్ భారత్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ప్రకటించాడు. కాగా, రషీద్ వన్డే వరల్డ్‌కప్ అనంతరం వెన్నెముక సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, భారత్-ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభంకానుంది. మొహాలీ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ అనంతరం జనవరి 14న రెండో టీ20 (ఇండోర్), జనవరి 17న (బెంగళూరు) మూడో టీ20 జరుగనున్నాయి.
తొలి టీ20కి కోహ్లి దూరం..
చాలాకాలంగా టీ20ల్లో తన బ్యాటింగ్ చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఊహించని షాక్ ఇచ్చాడు. వ్యక్తిగత కారణాల చేత అతను ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20కి దూరమయ్యాడు. కోహ్లి రెండో టీ20 నుంచి తిరిగి అందుబాటులోకి వస్తాడని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment