ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో ఒమన్ వేదికగా భారత్-ఎతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్-ఎ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు. సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరద్దరితో పాటు కరీం జనత్( 20 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు.
చదవండి: IPL 2025: 'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
Sediqullah hit two birds with ZERO stones! ⚡@ACBofficials #MensT20EmergingTeamsAsiaCup2024 #INDvAFG #ACC pic.twitter.com/MNdGmFiNgb
— AsianCricketCouncil (@ACCMedia1) October 25, 2024
Comments
Please login to add a commentAdd a comment