ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో సెకెండ్ సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. రెండో సెమీఫైనల్లో భాగంగా అల్ అమెరత్(ఒమన్) వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. అన్షుల్ కాంబోజ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు అఫ్గానిస్తాన్ మాత్రం ఏకంగా నాలుగు మార్పులు చేసింది.
బిలాల్ సమీ, మహమ్మద్ ఇషాక్, అల్లా గజన్ఫర్, జుబైద్ అక్బరీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు కూడా ఆజేయంగా నిలిచాయి. అదే జోరును సెమీస్‌లో కనబరచాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
తుది జట్లు
ఇండియా-ఎ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ(కెప్టెన్), ఆయుష్ బదోని, నెహాల్ వధేరా, రమణదీప్ సింగ్, నిశాంత్ సింధు, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, రసిఖ్ దార్ సలామ్, ఆకిబ్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్-ఎ: సెదిఖుల్లా అటల్, జుబైద్ అక్బరీ, దర్విష్ రసూలీ(కెప్టెన్), మహ్మద్ ఇషాక్(వికెట్ కీపర్), కరీం జనత్, షాహిదుల్లా కమల్, షరాఫుద్దీన్ అష్రఫ్, అబ్దుల్ రెహమాన్, అల్లా గజన్ఫర్, కైస్ అహ్మద్, బిలాల్ సమీ
Comments
Please login to add a commentAdd a comment