ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మొదటి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌తో ఇండియా-ఎ జట్టు తలపడనుంది. ఆక్టోబర్ 19న మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్ధిలు మధ్య పోరు జరగనుంది.
ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత జట్టుకు యువ ఆటగాడు, హైదరాబాదీ తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఇండియా జట్టులో తిలక్‌తో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు దక్కింది.
అదే విధంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుష్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కేకేఆర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్సీబీ) కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు.
మరోవైపు పాకిస్తాన్ జట్టుకు యువ ప్లేయర్ మహ్మద్ హ్యారీస్ నాయకత్వం వహించనున్నాడు. గతేడాది అతడి నేతృత్వంలోనే పాక్ జట్టు ఎమర్జింగ్ ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు హ్యారీస్ ఉవ్విళ్లరూతున్నాడు.
ఫైనల్ ఎప్పుడంటే?
కాగా ఆక్టోబర్ 18న హాంకాంగ్, చైనా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి.
గ్రూప్-బీతో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఎమర్జింగ్ ఆసియాకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఫ్యాన్‌కోడ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.
భారత్ ఎ: తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా సలాం, సాయి కిషోర్, రాహుల్ చాహర్
పాకిస్థాన్ ఎ: మహ్మద్ హారిస్ (కెప్టెన్/వికెట్ కీపర్), అబ్బాస్ అఫ్రిది, ఖాసిమ్ అక్రమ్, అహ్మద్ డానియాల్, షానవాజ్ దహానీ, మహ్మద్ ఇమ్రాన్, హసీబుల్లా ఖాన్ (వికెట్-కీపర్), యాసిర్ ఖాన్, జమాన్ ఖాన్, అరాఫత్ మిన్హాస్, సుఫియాన్ ముఖిమ్, మెహ్రాన్ ముఖిమ్ , అబ్దుల్ సమద్, ఒమైర్ యూసుఫ్
Comments
Please login to add a commentAdd a comment