యూఏఈ వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు ఉత్తరప్రదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ మహ్మద్ అమాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అదే విధంగా ఈ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. బిహార్‌కు చెందిన 13 ఏళ్ల సూర్యవంశీ క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. వైభవ్ ఇప్పటికే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో బిహార్ తరపున వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు.
అతి పిన్న వయససులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డెబ్యూ చేసిన ఎనిమిదవ ప్లేయర్‌గా వైభవ్ నిలిచాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు రంజీ మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ..87 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్ సిరీస్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ చేసి సత్తాచాటాడు.
రెడ్ బాల్ క్రికెట్‌లో తన సత్తాను నిరూపించుకున్న ఈ యువ క్రికెటర్.. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్‌లో దుమ్ములేపేందుకు సిద్దమయ్యాడు. ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్‌లో-ఎలో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతో పాటు పాకిస్తాన్, జపాన్, ఆతిథ్య యూఏఈ ఉన్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 30న దుబాయ్ వేదికగా పాకిస్తాన్ అండర్-19 టీమ్‌తో తలపడనుంది.
భారత అండర్-19 జట్టు
ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, సి ఆండ్రీ సిద్దార్థ్, మొహమ్మద్. అమన్ (కెప్టెన్), కిరణ్ చోర్మలే (వైస్ కెప్టెన్), ప్రణవ్ పంత్, హర్వాన్ష్ సింగ్ పంగాలియా (వికెట్ కీపర్), అనురాగ్ కవ్డే (వికెట్ కీపర్), హార్దిక్ రాజ్, ఎండి. ఈనాన్, కెపి కార్తికేయ, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహా, చేతన్ కుమార్, నిఖిల్
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు: సాహిల్ పరాఖ్, నమన్ పుష్పక్, అన్మోల్జీత్ సింగ్, ప్రణవ్ రాఘవేంద్ర, డి దీపేష్
చదవండి: ఆ నలుగురు నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశారు: శాంసన్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment