హార్దిక్ పాండ్యా (PC: IPL/MI X)
IPL 2024- MI- Hardik Pandya: ఐపీఎల్-2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ మొదలయ్యే నాటికి అతడు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా.. హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బ్యాటర్ కొట్టిన షాట్‌ను ఆపేందుకు విఫలయత్నం చేసిన పాండ్యా.. అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడి చీలమండకు గాయమైంది.
వరల్డ్‌కప్ సందర్భంగా గాయపడ్డ పాండ్యా
నొప్పి తీవ్రం కావడంతో మైదానం వీడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. ఐసీసీ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి నెలలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఆడనున్న టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్-2024 ఎడిషన్‌కు అతడు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్డీటీవీ కథనం వెలువరించింది.
టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న ముంబై
కాగా తాజా ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక కోలుకోకపోతే ముంబై ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు.
ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా స్వదేశంలో చివరి సిరీస్ ఆడనుంది. అఫ్గనిస్తాన్‌తో జరుగనున్న ఈ సిరీస్‌కు ఇప్పటికే తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమైనట్లు తెలుస్తోంది. తాజాగా పాండ్యా కూడా దూరం కానున్నాడన్న వార్తల నేపథ్యంలో జట్టును ఎవరు ముందుకు నడిపిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.
చదవండి: సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ కష్టం.. అలా అయితేనే గెలుస్తాం: గంభీర్
Comments
Please login to add a commentAdd a comment