
తోడబుట్టిన తమ్ముడు విశాల్‌తో రోహిత్ శర్మ (PC: Vishal Sharma Instagram)
సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు రోహిత్ శర్మ. ఆర్థిక పరిస్థితుల కారణంగా చిన్ననాడు తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంటిలో జీవించే భాగ్యానికి కూడా దూరమైన అతడు.. ‘హిట్‌మ్యాన్’గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.
పేదరికాన్ని జయించి అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకడిగా నిలిచి.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మరి ఆ లైఫ్‌లో కేవలం భార్య రతిక సజ్దే, కూతురు సమైరా శర్మ మాత్రమే ఉన్నారా?! రోహిత్ తల్లిదండ్రులు, తోడబుట్టిన తమ్ముడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?
వైజాగ్ మనుమడు
రోహిత్ శర్మ తల్లిదండ్రుల పేర్లు గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ. పూర్ణిమ విశాఖపట్నానికి చెందిన వారు. ఈ దంపతులకు 1987, ఏప్రిల్ 30న కుమారుడు రోహిత్ శర్మ జన్మించాడు. అనంతరం మరో కుమారుడు జన్మించగా అతడికి విశాల్ శర్మగా నామకరణం చేశారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన రోహిత్‌కు రెండేళ్ల వయసు ఉన్నపుడు వాళ్ల కుటుంబం డోంబివలీ ఏరియాకు మారింది. గురునాథ్ శర్మ ఓ ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో స్టోర్‌హౌజ్ కేర్‌టేకర్‌గా పనిచేసేవారు.
తల్లిదండ్రులకు దూరంగా
అయితే, కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సినంత ఆదాయం లభించేది కాదు. అందుకే డోంబివలీకి మకాం మార్చిన గురునాథ్ శర్మ.. తన పెద్ద కుమారుడు రోహిత్‌ను అతడి బామ్మతాతయ్యల వద్దకు పంపించారు.
వాళ్ల దగ్గరే పెరిగిన రోహిత్ శర్మ వారాంతాల్లో మాత్రం తల్లిదండ్రులను చూసేందుకు వచ్చేవాడు. అప్పుడే తమ్ముడు విశాల్‌తో ఆడుకునే సమయం దొరికేది. ఇద్దరూ కలిసి క్రికెట్ ఆడుతూ కబుర్లు చెప్పుకొనేవారు.
అయితే, రోహిత్‌లో దాగున్న ప్రతిభను గమనించిన అతడి అంకుల్ క్రికెట్ క్యాంపులో.. రోహిత్ పేరును నమోదు చేయించాడు. 14వ ఏట అలా క్రికెట్‌లో అడుగుపెట్టిన ‘హిట్‌మ్యాన్’.. ఒక్కో మెట్టు ఎక్కుతూ భారత జట్టులో కీలక సభ్యుడిగా.. ప్రస్తుతం కెప్టెన్‌గా మారాడు.
తమ్ముడిని ఉద్యోగం మాన్పించి
తనకు మేనేజర్‌గా వ్యవహరించిన రితికా సజ్దేను పెళ్లాడగా.. వీరికి కుమార్తె సమైరా జన్మించింది. భార్యా, కుమార్తెతో కలిసి ముంబైలోని లగ్జరీ ఏరియాలో నివసించే రోహిత్ శర్మ తన తల్లిదండ్రులు, తమ్ముడి కోసం అతడి ఇంటికి కాస్త దూరంలో మరో ఇల్లును కొనుగోలు చేశాడు.
పెద్ద కొడుకుగా కుటుంబం పట్ల తన బాధ్యతలన్నీ నెరవేరుస్తున్న రోహిత్ శర్మ.. తమ్ముడు విశాల్‌కు కూడా దన్నుగా నిలిచాడు. క్రికెటర్‌గా తను ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత విశాల్ వేరే చోట ఉద్యోగం చేయకుండా తన క్రికెట్ అకాడమీలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించాడు. విశాల్ శర్మ ప్రస్తుతం ఇండియా, సింగపూర్‌లో ఉన్న రోహిత్ క్రిక్‌కింగ్‌డమ్ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నాడు.
కవల కుమార్తెలతో విశాల్ శర్మ PC: Vishal Sharma Instagram
కవల పిల్లలతో ముచ్చటైన కుటుంబం
ఇక విశాల్ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే.. దీపాలి షిండే అనే అమ్మాయితో అతడికి వివాహం జరిగింది. ఈ జంటకు 2021లో కవల కూతుళ్లు అనైరా, అనైషా జన్మించారు. వీరిద్దరి పుట్టినరోజు నేడు(జనవరి 9). ఈ సందర్భంగా విశాల్ - దీపాలి తమ కుమార్తెలకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ అందమైన ఫొటోలు షేర్ చేశారు. అదండీ సంగతి!!
అఫ్గన్‌తో సిరీస్‌తో అంతర్జాతీయ టీ20లలో..
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న రోహిత్ శర్మ జనవరి 11 నుంచి అఫ్గనిస్తాన్‌తో మొదలయ్యే సిరీస్‌తో టీమిండియా తరఫున టీ20లలో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా రోహిత్ సారథ్యంలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: IND vs SA 2nd Test: రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్.. కేప్‌టౌన్ పిచ్‌పై ఐసీసీ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment