Ind vs Afg- Virat Kohli Golden Duck: అఫ్గనిస్తాన్‌తో మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్‌తోనే కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు.
వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్‌కు దూరమైన ఈ రన్‌మెషీన్.. ఇండోర్‌లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 16 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న మూడో టీ20లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి.. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
తొలిసారిగా గోల్డెన్ డక్
అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్‌లో.. టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి.. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు.
తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు కోహ్లి. అది కూడా ఐపీఎల్‌లో తన సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు మూటగట్టుకోవడం గమనార్హం.
స్టేడియం మొత్తం గప్‌చుప్
దీంతో.. కోహ్లి బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్ కోహ్లి అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment