
Team India Practicing Ahead AFG Clash T20 WC 2021.. టి20 ప్రపంచకప్ 2021లో రెండు వరుస పరాజయాలతో డీలా పడిన టీమిండియా బుధవారం అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. సెమీస్ అవకాశాలు దాదాపు కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో భారీ విజయం అందుకుంటే ఎంతో కొంత ఆశలు మిగిలి ఉంటాయి. మరోవైపు అఫ్గానిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. ఒక ఓటమితో సెమీస్ రేసులో ఉంది. అఫ్గాన్ మంచి పోరాటపటిమ కనబరుస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలవాలంటే కష్టపడాల్సిందే.
చదవండి: T20 WC 2021: 'ప్రపంచకప్ మాదే' అన్న పాక్ అభిమాని.. స్టువర్ట్ బ్రాడ్ సూపర్ రిప్లై
అందుకే టీమిండియా మ్యాచ్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రాక్టీస్ చేసింది. కోహ్లి, రోహిత్ శర్మతో పాటు మిగతా ఆటగాళ్లు పోటాపోటీగా నెట్స్‌లో చెమటోడ్చారు. ఈ సందర్భంగా బీసీసీఐ వీడియోనూ షేర్ చేస్తూ.. ''ఈ మ్యాచ్‌తో గాడిలో పడతారనుకుంటున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది.
బీసీసీఐ షేర్ చేసిన వీడియోపై మాత్రం అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ప్రాక్టీస్ వరకు బాగానే ఉంటుంది.. కానీ అసలు మ్యాచ్‌లోనే చేతులేత్తేస్తారు. అఫ్గాన్‌ను లైట్ తీసుకుంటే మీకు మూడుతుంది.. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఫామ్‌లోకి రండి అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: IND Vs AFG: టీమిండియా మాకో విజయం కావాలి!.. తేడా వస్తే
Talk about getting into the groove 💪 👍@imVkohli | @ImRo45 #TeamIndia #T20WorldCup #INDvAFG pic.twitter.com/utXY9tSOKE
— BCCI (@BCCI) November 3, 2021
Comments
Please login to add a commentAdd a comment