రాహుల్ ద్రవిడ్ (PC: Jio Cinema)
అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆడబోయే ఓపెనింగ్ జోడీ గురించి టీమిండియా హెడ్‌కోచ్ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. కాగా సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన టీమిండియా అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
సొంతగడ్డపై జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే.. జనవరి 11నాటి తొలి మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే మొహాలీకి చేరుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆరంభానికి ముందు కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా టీ20లలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు. అతడి ప్రదర్శనల పట్ల మేనేజ్‌మెంట్ సంతృప్తిగా ఉందని.. అందుకే ఈసారి కూడా అవకాశం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘రోహిత్, జైస్వాల్‌తో ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నాం.
ఇలాంటి అద్భుతమైన టీమ్ అందుబాటులో ఉన్నపుడు జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందరికీ అన్నిసార్లు అవకాశాలు రాకపోవచ్చు.
ఏదేమైనా జైస్వాల్ ఓపెనర్‌గా విజయవంతమైన తీరు పట్ల సంతోషంగా ఉన్నాం. అతడి వల్ల టాపార్డర్‌లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కుదిరింది’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆడిన 15 టీ20లలో యశస్వి జైస్వాల్ 159కి పైగా స్ట్రైక్‌రేటుతో 430 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫిఫ్టీలు, ఓ సెంచరీ ఉండటం విశేషం.
ఇక అఫ్గన్‌తో సిరీస్‌లో రోహిత్‌కు జోడీగా యశస్వి దిగనుండటంతో మరో స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, తొలి టీ20కి విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు కాబట్టి అతడు వన్‌డౌన్‌లో ఆడే అవకాశం దక్కించుకోవచ్చు.
చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment