అఫ్గాన్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక నేడే.. ?ముంబైకు చేరుకున్న రోహిత్‌ శర్మ. . వీడియో వైరల్‌ | Rohit Sharma poses With Airport Crew While Returning From South Africa | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక నేడే.. ?ముంబైకు చేరుకున్న రోహిత్‌ శర్మ. . వీడియో వైరల్‌

Published Sun, Jan 7 2024 10:17 AM | Last Updated on Sun, Jan 7 2024 10:56 AM

Rohit Sharma poses With Airport Crew While Returning From South Africa - Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించిన భారత జట్టు.. శనివారం ముంబైకు చేరుకుంది. టీమిండియాకు ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొంతమంది ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా కేప్‌టౌన్‌ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్‌ చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను కేవలం రెండు రోజుల్లోనే టీమిండియా ముగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో భారత్‌ సమం చేసింది. అంతకుముందు ఇదే పర్యటనలో సఫారీలతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ను టీమిండియానే సొంతం చేసుకుంది.

ఇక స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్దం కానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టును ఆదివారం అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ సిరీస్‌తో రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తిరిగి టీ20ల్లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: BBL 2023-24: ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్‌ ఇచ్చేసిన థర్డ్‌ అంపైర్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement