PC: BCCI Twitter
ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. దాదాపు మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో తన 71వ సెంచరీని కోహ్లి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(118 పరుగులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో రోహిత్ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.
అదే విధంగా మరో రికార్డును కూడా కోహ్లి తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఆఫ్గానిస్తాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన తొలి ఆటగాడిగా రన్‌మిషన్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు లూక్ రైట్ (99 నటౌట్) పేరిట ఉండేది.
చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్!
Comments
Please login to add a commentAdd a comment