ఆసియాక్రీడల్లో భారత్-ఆఫ్గానిస్తాన్ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఆఫ్గాన్ ఇన్నింగ్స్ 18 ఓవర్లలో 112/5 వద్ద మ్యాచ్ ఆగిపోయింది. వర్షం తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ సేనకు స్వర్ణం ఖాయమైంది.
18 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 109/5
18 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(48), నైబ్(26) పరుగులతో ఉన్నారు.
15 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 86/5
15 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.
13 ఓవర్లకు ఆఫ్గానిస్తాన్ స్కోర్: 70/5
13 ఓవర్లు ముగిసే సరికి ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో షహీదుల్లా కమల్(36), నైబ్(4) పరుగులతో ఉన్నారు.
ఐదో వికెట్ కోల్పోయిన ఆఫ్గానిస్తాన్..
భారత్‌తో జరగుతున్న ఫైనల్‌లో ఆఫ్గానిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 53 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. కేవలం ఇఒక్క పరుగు మాత్రమే చేసిన కరీం జనత్.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 53/5
నాలుగో వికెట్ డౌన్..
49 పరుగుల వద్ద ఆఫ్గానిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన జజాయ్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
9 ఓవర్లలో అఫ్గనిస్తాన్ స్కోరు: 47/3
షహీదుల్లా కమల్ నిలకడగా ఆడుతుండటంతో(21 పరుగులతో ) అఫ్గన్ ఇన్నింగ్స్ తిరిగి గాడిలో పడింది.
13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆఫ్గానిస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. నూర్ అలీ జద్రాన్ రూపంలో ఆఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన జద్రాన్ రనటౌయ్యాడు.
రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్గాన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గానిస్తాన్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. 5 పరుగులు చేసిన జుబైద్ అక్బరీను శివమ్ దుబే పెవిలయన్‌కు పంపగా.. మహ్మద్ షాజాద్(4)ను అర్ష్‌దీప్ ఔట్ చేశాడు. 3 ఓవర్లకు ఆఫ్గాన్ స్కోర్: 10/2
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ఈ గోల్డ్‌మెడల్ పోరులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా పేసర్ అవేష్ ఖాన్ దూరమయ్యాడు. భారత జట్టు మొత్తం నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. మరోవైపు ఆఫ్గానిస్తాన్ ఒకే ఒక మార్పు చేసింది. జుబైద్ అక్బరీ తుది జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
భారత్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్ష్దీప్ సింగ్
ఆఫ్గానిస్తాన్: జుబైద్ అక్బరీ, మహ్మద్ షాజాద్(వికెట్ కీపర్), నూర్ అలీ జద్రాన్, షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్(కెప్టెన్), షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, ఫరీద్ అహ్మద్ మాలిక్, జహీర్ ఖాన్
టాస్ ఆలస్యం..
ఏషియన్ గేమ్స్-2023 పురుషుల క్రికెట్ ఫైనల్లో పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానం వేదికగా భారత్- ఆఫ్గానిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో టాస్ కాస్త ఆలస్యం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment