టీమిండియాకు బిగ్‌ షాక్‌ | Hardik Pandya, Suryakumar Yadav, Ruturaj Gaikwad Ruled Out Of Afghanistan T20I Series Says Reports | Sakshi
Sakshi News home page

టీమిండియాకు బిగ్‌ షాక్‌

Published Sun, Jan 7 2024 6:25 PM | Last Updated on Sun, Jan 7 2024 6:25 PM

Hardik Pandya, Suryakumar Yadav, Ruturaj Gaikwad Ruled Out Of Afghanistan T20I Series Says Reports - Sakshi

జనవరి 11 14, 17 తేదీల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఇన్‌ ఫామ్‌ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఆఫ్ఘన్‌ సిరీస్‌కు దూరమయ్యారు. వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా గాయపడ్డ హార్దిక్‌ పాండ్యా కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. 

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు ఇవాళ ముంబైలో సమావేశం కానున్నారు. అజిత్‌ అగర్కార్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌తో పాటు ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌ (తొలి రెండు టెస్ట్‌లకు) కోసం కూడా భారత జట్టును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌తో రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ,  విరాట్‌ కోహ్లి తిరిగి టీ20ల్లోకి పునరాగమనం చేయనున్నట్లు సమాచారం​. 

ఇదిలా ఉంటే, టీమిండియాతో సిరీస్‌ కోసం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఆఫ్ఘన్‌ జట్టుకు సారధిగా  ఇబ్రహీం జద్రాన్‌ వ్యవహరించనున్నాడు. ఇటీవలే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్న రషీద్‌ ఖాన్‌ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యాడు. 

టీమిండియాతో టీ20 సిరీస్‌కు అఫ్గనిస్తాన్‌ జట్టు..
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్‌ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement