
ఆఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆఫ్గాన్ క్రికెటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హష్మతుల్లా షాహిదీ.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో షాహిదీ 3సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గాన్ మిడిలార్డర్ బ్యాటర్ నజీబుల్ జర్డాన్(2సార్లు) పేరిట ఉండేది. అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఫిప్టీ ఫ్లస్ స్కోర్ సాధించిన తొలి ఆఫ్గాన్ కెప్టెన్‌గా కూడా షాహిదీ రికార్డులకెక్కాడు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో 88 బంతులు ఎదుర్కొన్న షాహిదీ 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 80 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు, కుల్దీప్, శార్థూల్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.