Virat Kohli Dances To The Tunes Of My Name Is Lakhan: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో తారసపడిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Kohli and his dance steps are pure bliss to watch 😁❤️ pic.twitter.com/1nhWlHKskT
— ⋆✰𝐓𝐚𝐧𝐮𝐬𝐡𝐫𝐞𝐞✰⋆ (@TansMe_V) November 4, 2021
టీమిండియా ఫీల్డింగ్ సందర్భంగా స్టాండ్స్‌లో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌కి చెందిన పాపులర్ సాంగ్ "మై నేమ్ ఈజ్ లఖన్" ప్లే అవుతుండగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ ట్యూన్‌కి తగ్గట్టుగా చిందేసి ప్రేక్షకులను హుషారెక్కించాడు. ఇందుకు అభిమానులు కూడా థ్రిల్ అయ్యారు. దీంతో స్టేడియం మొత్తం అరుపులు, కేకలతో హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, 2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా కూడా విరాట్ ఇలానే మైదానంలో స్టెప్పులేసి అభిమానులను అలరించాడు.
ఇదిలా ఉంటే, అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్ రాహుల్(69), రోహిత్ శర్మ(74) సహా రిషభ్ పంత్(27 నాటౌట్), హార్దిక్ పాండ్యా(35 నాటౌట్) శివాలెత్తడంతో టీమిండియా 210 పరుగులు స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్య చేధనకు బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. ఆఫ్గాన్ ఇన్నింగ్స్‌లో కరీం జనత్(42), నబీ(35) రాణించారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టగా, ఆశ్విన్ రెండు, రవీంద్ర జడేజా, బుమ్రా చెరో వికెట్ సాధించారు.
చదవండి: Rahul Dravid: టీమిండియా కెప్టెన్‌గా అతనే నా ఫస్ట్ ఛాయిస్..
Comments
Please login to add a commentAdd a comment