
టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఆడనున్నాడు. రంజీ ట్రోఫీ-2024లో భాగంగా జనవరి 12 నుంచి 15 వరకు ఆంధ్రాతో జరగనున్న మ్యాచ్‌కు ముంబై జట్టులో అయ్యర్ పేరును సెలక్టర్లు చేర్చారు. సర్ఫరాజ్ ఖాన్ స్ధానాన్ని అయ్యర్‌తో ముంబై సెలక్టర్లు భర్తీ చేశారు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్ ఎతో జరిగే సిరీస్‌లో భారత్ ఎ జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ సన్నాహకాల్లో భాగంగానే రంజీల్లో ఆడాలని అయ్యర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో శ్రేయస్ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అతడికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారో లేదా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారో ఇప్పటివరకు అయితే ఎటువంటి సమాచారం లేదు.
ముంబై జట్టు: జింక్యా రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, జే బిస్తా, భూపేన్ లల్వానీ, అమోఘ్ భత్కల్, సువేద్ పార్కర్, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, అథర్వ అంకోలేకర్, మోహిత్ అవస్తి, ధావల్ అవస్తి , రాయ్‌స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా.
Comments
Please login to add a commentAdd a comment