టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అతడిని భారత సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-డి జట్టుకు అయ్యర్ సారథ్యం వహించాడు. కానీ అక్కడ కూడా తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో శ్రేయస్ విఫలమయ్యాడు.
ఈ టోర్నీలో మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం రెండు సార్లు మాత్రమే 50 పరుగుల మార్క్‌ను అతడు అందుకున్నాడు. అదే విధంగా రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే దులీప్ ట్రోఫీలో విఫలమైన అయ్యర్.. ఇప్పుడు ఇరానీ ట్రోఫీపై దృష్టి సారించాడు. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో పునరాగమనం చేయాలని ఈ ముంబైకర్ భావిస్తున్నాడు.
అపార్ట్‌మెంట్ కొన్న అయ్యర్..
ఇక ఇది ఇలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ మరో ఖరీదైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశాడు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో రూ. 2.90 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమ్మ రోహిణీ అయ్యర్‌తో కలిసి అతడు ఈ ఇంటిని కొన్నట్టు స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు చెబుతున్నారు.
వర్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలోని త్రివేణి ఇండస్ట్రియల్ సీహెచ్‌ఎస్‌ఎల్‌లోని 2వ అంతస్తులో అపార్ట్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. జాప్కీ రిపోర్ట్ ప్రకారం.. 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయ్యర్ ఖరీదు చేసిన అపార్ట్‌మెంట్ ఉందంట.
రిజిస్ట్రేషన్ కోసం రూ.17.40 లక్షల స్టాంప్ డ్యూటీ అయ్యర్ కట్టినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ముంబైలో అయ్యర్ పేరిట ఓ అపార్ట్‌మెంట్ ఉంది. 2020లో ముంబైలోనే అత్యంత ఎత్తైన లోధా వరల్డ్ టవర్స్ ని 48వ అంతస్థులో ప్లాట్‌ను శ్రేయస్ కొనుగోలు చేశాడు.
చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్?
Comments
Please login to add a commentAdd a comment