బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పాండ్యా (PC: BCCI)
Hardik Pandya's Gym Video: తన అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా! తన గాయంపై అప్‌డేట్ అందిస్తూ వీడియోతో ముందుకు వచ్చాడు. రోజురోజుకీ పురోగతి సాధిస్తున్నానని.. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాననే సంకేతాలు ఇచ్చాడు.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు దూరమై
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. పుణె వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో తన బౌలింగ్‌లో బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో పట్టుతప్పి పడిపోయిన పాండ్యా కాలు మెలిక పడింది.
ఈ నేపథ్యంలో అతడి చీలమండకు గాయం కాగా.. ఈ ఐసీసీ టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్ నాటికి పాండ్యా అందుబాటులోకి వస్తాడని భావించగా.. గాయం తీవ్రత దృష్ట్యా అతడు ఆటకు దూరంగానే ఉండిపోయాడు.
అఫ్గన్ సిరీస్‌తో రీఎంట్రీ?
అయితే, జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సమయానికైనా హార్దిక్ మైదానంలో దిగుతాడనుకుంటే.. అతడు ఇంకా కోలుకోలేదనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం జిమ్ వీడియో షేర్ చేసిన పాండ్యా.. ఫిట్‌నెస్‌పరంగా రోజురోజుకీ మెరుగవుతున్నట్లు తెలిపాడు. త్వరలోనే రీఎంట్రీ ఇస్తానని వెల్లడించాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
భారీ మొత్తంతో ముంబై కెప్టెన్‌గా
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024 వేలానికి ముందు టీమిండియా భావి కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తానికి ట్రేడ్ అయి తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరిన ఈ బరోడా క్రికెటర్.. ఏకంగా ఆ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
టీమిండియా సారథి రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించకపోతే మాత్రం హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి.
చదవండి: Aus Vs Pak: నా రికార్డు బ్రేక్ చేసే సత్తా అతడికే ఉంది: ఆసీస్ దిగ్గజ బౌలర్
Comments
Please login to add a commentAdd a comment