చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా | ICC World Cup 2023, India Vs Afghanistan: Rohit Sharma Breaks Chris Gayle’s Record For Most Sixes In International Cricket With 554th Maximum - Sakshi
Sakshi News home page

WC ODI 2023: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

Published Wed, Oct 11 2023 7:32 PM | Last Updated on Wed, Oct 11 2023 7:48 PM

Rohit Sharma has hit the MOST sixes in ALL formats of international cricket  - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ వేసిన నవీన్‌ ఉల్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్‌ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌(553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్‌ రికార్డును హిట్‌మ్యాన్‌ బద్దలు కొట్టాడు.
చదవండి: WC 2023: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్‌ వివాదస్పద ట్వీట్‌! ఆటను వదిలి ఇతర అంశాల్లోకి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement