India vs Afghanistan, 1st T20I Updates:
టీమిండియా ఘన విజయం..
మొహాలీ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు.
తొలుత బౌలింగ్‌లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు.
టీమిండియా నాలుగో వికెట్ డౌన్
117 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన జితేష్ శర్మ.. ముజీబ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
13 ఓవర్లకు టీమిండియా స్కోర్: 112/3
13 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. భారత విజయానికి 42 బంతుల్లో 47 పరుగులు కావాలి. క్రీజులో జితేష్ శర్మ(27), శివమ్ దుబే(34) పరుగులతొ ఉన్నారు.
మూడో వికెట్ డౌన్..
72 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ఓమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
పవర్ ప్లేలో అఫ్గన్ పైచేయి
కట్టుదిట్టంగా అఫ్గన్ బౌలింగ్.. టీమిండియా స్కోరు: 36-2(6)
3.5: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
శుబ్‌మన్ గిల్(23) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 12 బంతుల్లో 5 ఫోర్లతో దూకుడుగా ఆడిన గిల్ ముజీబ్ ఉర్ రహ్మాన్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌అయ్యాడు. తిలక్ వర్మ(5) , శివం దూబే క్రీజులో ఉన్నారు. స్కోరు: 28-2(4)
►టీమిండియా స్కోరు: 8/1 (2)
0.2: రోహిత్ శర్మ రనౌట్
అఫ్గాన్ విధించిన 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్‌గా వెనుదిరిగాడు. డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అతడి రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ, గిల్ క్రీజులో ఉన్నారు.
టీమిండియా టార్గెట్ 159 పరుగులు
మొహాలీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి అఫ్గానిస్తాన్ 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు.
19వ ఓవర్లో 13 పరుగులు ఇచ్చుకున్న వాషింగ్టన్ సుందర్
ఒకే ఓవర్లో ముకేశ్‌కు రెండు వికెట్లు
17.6: మహ్మద్ నబీ రూపంలో అఫ్గానిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్ మొదటి బంతికి అజ్మతుల్లాను బౌల్డ్ చేసిన ముకేశ్ నబీ(42)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. స్కోరు: 130-5(18). నజీబుల్లా, కరీం క్రీజులో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్
17.1: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అజ్మతుల్లా బౌల్డ్(20). అతడి స్థానంలో నజీబుల్లా జద్రాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 129/4 (17.4)
15 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 105/3
15 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఒమర్జాయ్(25), నబీ(26) అఫ్గాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్..
57 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రెహమత్ షా.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు
రెండో వికెట్ డౌన్..
అఫ్గానిస్తాన్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 25 పరుగులు చేసిన అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్.. శివమ్ దుబే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 53/2
తొలి వికెట్ కోల్పోయిన అఫ్గాన్..
50 పరుగుల వద్ద అఫ్గానిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన గుర్భాజ్.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
6 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోర్
6 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(16), ఇబ్రహీం జద్రాన్(15) పరుగులతో ఉన్నారు.
3 ఓవర్లకు అఫ్గానిస్తాన్ స్కోర్: 15/0
3 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ వికెట్ నష్టపోకుండా 15 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్(10), ఇబ్రహీం జద్రాన్(2) పరుగులతో ఉన్నారు.
మెయిడిన్‌తో ఆరంభం..
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తొలి ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ మెయిడిన్ చేశాడు.
భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. మొహాలీ వేదిగా తొలి టీ20లో టీమిండియా-అఫ్గానిస్తాన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
కాగా దాదాపు ఏడాది తర్వాత టీ20ల్లో రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అదే విధంగా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
అఫ్గానిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహమత్ షా, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బాదిన్ నాయబ్, ఫజల్హాక్ ఫారూఖీ, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment