వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి భారత్ చేరింది. 274 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.
కేవలం 63 బంతుల్లోనే హిట్‌మ్యాన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆఫ్గానిస్తాన్ బౌలర్లకు రోహిత్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రోహిత్ బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు.
అతడితో పాటు విరాట్ కోహ్లి(55) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
ఆఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ(80) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(62) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా రెండు, కుల్దీప్, శార్థూల్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు.
చదవండి: WC 2023: రోహిత్ శర్మ విధ్వంసం.. వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ! సచిన్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment