టీ20ల్లో మరోసారి భారత జట్టును నడిపించేందుకు రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జజట్టులో రోహిత్ శర్మకు చోటు దక్కింది. రోహిత్‌తో పాటు మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లికి అవకాశం లభించింది. దాదాపు 4 నెలల తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి టీమిండియా టీ20 జట్టులో చేరారు.
ఈ సీనియర్లు ఇద్దరూ టీ20 ప్రపంచకప్-2024లో కూడా భాగమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే ఈ సిరీస్‌కు భారత టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే హార్దిక్ గాయం నుంచి తిరిగి కోలుకుంటే రోహిత్ భారత జట్టుకు సారథ్యం వహిస్తాడా లేదా సెలక్టర్లు పాండ్యా వైపే మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతం అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా తన అభిప్రాయాలను వెల్లడించాడు. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చినా టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మనే జట్టుకు నాయకత్వం వహిస్తాడని చోప్రా తెలిపాడు. టీ20ల్లో రోహిత్ శర్మను తిరిగి కెప్టెన్‌గా చూడడం చాలా సంతోషంగా ఉంది. రోహిత్ అఫ్గాన్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌లో కూడా భారత జట్టును నడిపిస్తాడు.
అందులో ఎటువంటి సందేహం లేదు. హార్దిక్ తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు. ఇది రాసిపెట్టుకోండి. రోహిత్ జట్టులో ఉంటే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు చాలా తక్కువ అని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: Ind vs Eng: మహ్మద్ షమీ మరికొన్నాళ్లు.. ఇప్పట్లో కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment