టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా జోరును కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ బెర్త్ లాంఛనమైనట్లే. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో ప్రత్యర్ధిని 146 పరుగులకే కట్టడి చేసింది.
భారత విజయంలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. అతడితో పాటు కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
"టీ20ల్లో దూకుడుగా ఆడటం గురించి నేను చాలా రోజులుగా మాట్లాడుతున్నాను. ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో మేము అనుకున్నది చేసి చూపించాము. అన్ని విభాగాల్లో సత్తాచాటాము. ఓవరాల్‌గా మా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నాను.
పరిస్థితులను వేగంగా అందిపుచ్చుకున్నాము. ఈ మైదానంలో గాలులు వీచాయి. కానీ పరిస్థితులకు తగ్గట్టు మేము తెలివిగా వ్యవహరించాం. బ్యాట్, బాల్‌తో అద్బుతంగా రాణించాము. ఏది ఏమైనా జట్టులోని 8 మంది బ్యాటర్లు తమ పాత్ర షోషించాలి.
ఈ మ్యాచ్‌లో ఒక్క ప్లేయర్ హాఫ్ సెంచరీ చేసినప్పటకి మేము 197 పరుగులు చేసాము. టీ20ల్లో భారీ స్కోర్ సాధించాలంటే హాఫ్ సెంచరీలు, సెంచరీలు చేయాల్సిన అవసరం లేదు. జట్టులో బ్యాటర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తిడి తెస్తే చాలు.
ప్రపంచంలో అందరూ ఇలానే ఆడుతున్నారు. మేం కూడా అలానే ఆడాలనుకుంటున్నాం. మా జట్టులో చాలా మంది అనుభవిజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లకు జట్టు మెనెజ్‌మెంట్ కూడా సపోర్ట్‌గాఉంది. ఇక హార్దిక్ బ్యాట్‌తో రాణించడం ఎంత ముఖ్యమో అఫ్గాన్‌తో మ్యాచ్ అనంతరం కూడా చెప్పాను.
అతడి బ్యాటింగ్ మమ్మల్ని పటిష్ట స్థితిలో ఉంచుతుంది. హార్దిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడి సత్తా ఎంటో మాకు బాగా తెలుసు. అతడు మా జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడు. హార్దిక్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా మేము మంచి పొజిషేన్‌లో ఉంటాము.
ఈ మ్యాచ్‌లో బౌలర్లతో నేను మాట్లాడిన ప్రతీ సారి మాకు మంచి ఫలితమే వచ్చింది. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment