టీ20 వరల్డ్‌కప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు చివరి దశకు వచ్చాయి. ఈ దశలో మరో 11 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నా.. సూపర్-8కు చేరే జట్లపై ఓ అంచనా వచ్చేసింది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ సూపర్-8కు అర్హత సాధించగా.. ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకోగా.. నమీబియా, ఒమన్ జట్లు నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య పోటీ నెలకొంది.
గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సూపర్-8కు క్వాలిఫై కాగా.. శ్రీలంక ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్‌లో నేపాల్, నెదర్లాండ్స్ అధికారికంగా సూపర్-8 రేసులో ఉన్నప్పటికీ.. అనధికారికంగా బంగ్లాదేశ్ సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
గ్రూప్-ఏ విషయానికొస్తే.. ఈ గ్రూప్ నుంచి భారత్ సైపర్-8కు అర్హత సాధించగా.. అధికారికంగా మిగతా జట్లన్నీ సూపర్-8 రేసులో ఉన్నాయి. వీటిలో ఐర్లాండ్, కెనడా నామమాత్రంగా రేసులో ఉండగా.. ప్రధాన పోటీ యూఎస్‌ఏ, పాక్ మధ్యలోనే నెలకొంది.
ఇవాళ (జూన్ 14) జరుగబోయే మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. ఐర్లాండ్‌ను ఓడించినా లేక ఈ మ్యాచ్ రద్దైనా యూఎస్‌ఏ సూపర్-8కు చేరుకుంటుంది. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్‌తో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
సూపర్-8 బెర్త్‌లపై ఓ అంచనా వచ్చిన నేపథ్యంలో ఈ దశలో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ దశలో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆప్ట్రేలియా జట్లతో పోటీడనుంది. గ్రూప్-డి నుంచి సూపర్-8 బెర్త్ రేసులో నెదర్లాండ్స్ కంటే బంగ్లాదేశ్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
జూన్ 20- భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
జూన్ 22- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్ (గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు)
జూన్ 24- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
Comments
Please login to add a commentAdd a comment