వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్ బౌలర్లకు హిట్‌మ్యాన్ చుక్కలు చూపించాడు.
కేవలం 63 బంతుల్లోనే రోహిత్ శర్మ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 84 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 16 ఫోర్లు, 5 సిక్స్‌లతో 131 పరుగులు చేశాడు. తద్వారా పలు అరుదైన రికార్డులను హిట్‌మ్యాన్ తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
►వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. రోహిత్ కేవలం 63 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
►వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 7 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్(6) రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేశాడు.
►అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో 31 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్(30)ను అధిగమించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలతో అగ్రస్ధానంలో ఉన్నాడు.
►వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యంతవేగవంతమైన సెంచరీ చేసిన ఆరో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడైన్ మారక్రమ్ తొలి స్ధానంలో ఉన్నాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
►వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు ఓపెనర్‌గా 29 సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(28)ను వెనక్కినెట్టాడు.
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 554 సిక్స్‌లు బాదాడు. కాగా ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(553) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో గేల్ రికార్డును హిట్‌మ్యాన్ బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment